భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామంలో రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చందాలు అడగకుండా సొంతగా డబ్బులు జమ చేసి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేస్తుంటారు. యూత్ సభ్యులంతా కలిసి ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహిస్తారు.
అంతా కలిసి నిర్వహిస్తాం..
రెడ్డీస్ యూత్‌లో 50 మంది సభ్యులు ఉన్నాం. కొంత మంది నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్నారు. గణేశ్ ఉత్సవాల కోసం అంతాకలిసి ఊరికి వస్తారు. యువకులంతా కార్యక్రమాల నిర్వహణతోపాటు అన్నింటిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తాం.
– అక్షయ్‌రెడ్డి, రెడ్డీస్ యూత్ సభ్యుడు
కామోల్‌లో ఘనంగా..