
పర్యావరణ హిత గణపతి
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో 60 ఏళ్ల క్రితమే పర్యావరణ పరిరక్షణకు విశ్వబ్రాహ్మణులు ముందడుగు వేశారు. పట్టణానికి చెందిన అకినపల్లి నానయ్య పంతులు 1958లో మొట్టమొదటి సారిగా మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ కులస్తులు మట్టివిగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వబ్రాహ్మణ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు భజన చేయడంతో పాటు డీజేలు లేకుండా భక్తిపాటలతో భజన చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.