
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
దహెగాం: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. మండలంలోని లగ్గాం ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా బొలెరో వాహనంలో ఆరు పశువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌లో అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇలియాజ్ నవాబ్ ఖురేషి, షకీల్ ఖురేషీ, ఫరీద్‌లతో పాటు నిజామాబాద్‌కు చెందిన మొహ్మద్ రహ్మత్‌లపై కేసు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్సై రాజు, సిబ్బంది మహమూద్, విజయ్, మధు, రమేశ్, సాయి, రాజశేఖర్ పాల్గొన్నారు.