బోన్‌ క్యాన్సర్‌తో విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

బోన్‌ క్యాన్సర్‌తో విద్యార్థి మృతి

Aug 24 2025 8:36 AM | Updated on Aug 24 2025 8:36 AM

బోన్‌

బోన్‌ క్యాన్సర్‌తో విద్యార్థి మృతి

లక్ష్మణచాంద: మండలంలోని నర్సాపూర్‌(డబ్ల్యూ) గ్రామానికి చెందిన పులి అన్వేశ్‌ (18) అనే యువకుడు బోన్‌ క్యాన్సర్‌తో మృతి చెందాడు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడు గత కొంత కాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి గతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నకిలీ విద్యుత్‌ వైర్ల విక్రయం

ఇంద్రవెల్లి: మండల కేంద్రంలో నకిలీ విద్యుత్‌ వైర్లు (కేబుల్‌) అమ్ముతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. శనివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఐపీ ఇన్వేస్టిగేషన్‌/డిటెక్టివ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌చార్జి నాగేశ్వర్‌ ఫిర్యాదు మేరకు ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ షాపులను తనిఖీలు చేయగా నకిలీ విద్యుత్‌ వైర్లు లభ్యమయ్యాయి. నకిలీ కేబుల్‌ అమ్ముతున్న బాలాజీ ఎలక్ట్రానిక్స్‌ నిర్వాహకుడు ప్రవీణ్‌, రాహుల్‌ ఎలక్ట్రానిక్స్‌ నిర్వాహకుడు అంతర్వేది రఘునాథ్‌, బాలాజీ ఎలక్ట్రానిక్స్‌ నిర్వాహకుడు టగ్రే జ్ఞాన్‌సింగ్‌, న్యూ బాలాజీ ఎలక్ట్రానిక్స్‌ నిర్వాహకుడు బస్సి దినేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పండుగ పూట విషాదం

చింతలమానెపల్లి: పొలాల పండుగపూట విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా శనివారం పశువులను కడిగేందుకు కుంట వద్దకు వెళ్లిన యువరైతు కుంటలో పడి మృత్యువాత పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన జోడి గురుదాస్‌ (28) పశువులను తీసుకుని నీటికుంట వద్దకు వెళ్లాడు. మట్టితవ్వకాలతో కుంట లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో పడి ఈత రాక మృతి చెందాడు. కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఇస్లావత్‌ నరేశ్‌ అక్కడికి చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిమిత్తం తరలించారు. మృతుడి తండ్రి ఆనంద్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

నాటుసార పట్టివేత

కడెం: మండలంలోని పెద్దూర్‌తండా నుంచి చిన్నబెల్లాల్‌ గ్రామానికి నాటుసార తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ రంగస్వామి తెలిపారు. పెద్దూర్‌ తండాకు చెందిన ఇస్లావత్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి, బైక్‌, మొబైల్‌, 15 లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎకై ్సజ్‌ ఎస్సై అభిశేఖర్‌, సిబ్బంది వెంకటేశ్‌, హరీశ్‌, సాయి, రాజేందర్‌, ఇర్ఫాన్‌, రవళి తదితరులు ఉన్నారు.

బోన్‌ క్యాన్సర్‌తో విద్యార్థి మృతి1
1/1

బోన్‌ క్యాన్సర్‌తో విద్యార్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement