
బెట్టింగ్ బుకీ అరెస్ట్
నిర్మల్ టౌన్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏడా ది కాలంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌కు పోలీసులు చెక్ పెట్టారు. కార్యకలాపాలు జోరుగా నడిపిన సయ్యద్ అజమ్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం వివరాలు వెల్లడించారు. భైంసాకు చెందిన సయ్యద్ అజమ్ మీసేవా సర్వీస్ సెంటర్ నిర్వహిస్తూనే Allpannel.coM ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ అజమ్ కొందరి బ్యాంక్ ఖాతాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్‌ను సేకరించి, వాటి ద్వారా బెట్టింగ్ లావాదేవీలను నిర్వహించాడు. ఈ ఖాతాదారులకు నెలవారీగా నామమాత్రపు మొత్తం చెల్లించి, వారి ఖాతాలను దుర్వినియోగం చేశాడు. బెట్టింగ్ ద్వారా సేకరించిన డబ్బును ఈ ఖాతాల్లో జమ చేసి, నకిలీ ఆదాయపు పన్ను ధ్రువీకరణ పత్రాలను సృష్టించాడు. ఈ ప్రక్రియలో కొందరు లక్షలాది రూపాయలు నష్టపోయారు. దీంతో వారిని బెట్టింగ్ కోసం డబ్బు చెల్లించిన వారిని బెదిరించి మోసం చేశాడు.
పోలీసుల దాడి..
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఎస్పీ జానకీషర్మి ల ఆదేశాలతో భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ నే తృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం, సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో, గురువారం రాత్రి భైంసా ఓవైసీ నగర్‌లోని అజమ్ నివాసంపై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. అజమ్ నుంచి రూ.16.3 లక్షల నగదు, 384.38 గ్రాముల బంగారు ఆభరణాలు, 55 గ్రాముల బంగారు బిస్కెట్ బిల్లలు, 21 ఆస్తి దస్తావేజులు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.లక్ష విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులు, ఎనిమిది ఏటీఎం కార్డులు, బాధితుల పాన్, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అజమ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే భైంసాకు చెందిన ఇర్ఫాన్, నిర్మల్‌కు చెందిన శివచారి, రెహమాన్, నరేశ్, ప్రణయ్, కళ్యాణ్, మణికంఠ, వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ను సమర్థవంతంగా ఛేదించిన ఏఎస్పీ అవినాష్, సీఐ గోపీనాథ్, కానిస్టేబుళ్లు జయవంత్‌రావ్, ప్ర మోద్, మాణిక్ రావ్, బాలాజీ, క్రాంతిని ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.

బెట్టింగ్ బుకీ అరెస్ట్