
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీనివాస్‌రెడ్డి గిఫ్ట్ డీడ్ చేసేందుకు డిమాండ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2 గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీకి చిక్కా డు. ఓ ఇంటి స్థలాన్ని గిఫ్ట్ డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఇటీవల ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బాధితుడి నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ మధు ఆధ్వర్యంలో ఏసీ బీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఈ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కి చిక్కడం ఇది కొత్తేమీ కాదు. 2016లో మంచిర్యాలలో పనిచేసే సమయంలోనూ ఇలాగే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అయినా తీరు మార్చుకోలేదు. మరోసారి లంచం తీసుకుంటుండగా పట్టుబడి జైలుపాలయ్యారు. బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన మన్సుర్ ఖాన్ పటాన్ తన భార్య గౌసియా బేగం పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరిట గిఫ్ట్‌డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేయించేందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఈ నెల 19న డాక్యుమెంట్ రైటర్ ముదసిర్‌షాతో పత్రాలు తయారు చేయించాడు. ఆ తర్వాత గిఫ్డ్‌డీడ్ కోసం జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లగా అతడు పత్రాలు పరిశీలించి రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం కెమికల్ పూసిన నగదును ఇస్తుండగా సబ్ రిజిస్ట్రార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికా రులు, ఉద్యోగులు సేవల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 1064 నంబర్‌కు సమాచారమివ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.