
30 ఏళ్లుగా ఇదే వృత్తి
నిర్మల్‌టౌన్: రాజస్థాన్ నుంచి వచ్చి 30 ఏళ్లుగా నిర్మల్ పట్టణంలో వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నాం. సుమారు వెయ్యి విగ్రహాలు తయారు చేశాం. మా దగ్గర ఒక్క ఫీట్ నుంచి 11 ఫీట్ల ఎత్తు వినాయక విగ్రహాలు దొరుకుతాయి. వీటి ధర రూ.100 నుంచి రూ.40 వేల వరకు పలుకుతుంది.
– అశోక్, రాజస్థాన్ కళాకారుడు
చిన్నప్పటి నుంచే రంగులద్దే పని
నిర్మల్‌టౌన్: రాజస్థాన్ నుంచి కుటుంబంతో వచ్చిన నేను చిన్నప్పటి నుంచే వినాయక విగ్రహాలకు రంగులద్దుతాను. వివిధ రకాల విగ్రహాలు తయారు చేసుకుంటూ నిర్మల్‌లోనే జీవిస్తున్నాం. పండుగలు, వివాహాలకే రాజస్థాన్‌కు వెళ్లి వస్తాం. వినాయక విగ్రహాలకు అద్భుతమైన
రంగులద్ది అందంగా ముస్తాబు చేస్తా.
– సుఖియా, రాజస్థాన్ కళాకారిణి
ఏటా వచ్చి వెళ్తా..
నిర్మల్‌టౌన్: నేను ప్రత్యేకంగా వినాయక విగ్రహాలను సాంచలో పెట్టి తయారు చేస్తుంటాను. తొమ్మిదేళ్ల నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. ఇప్పటివరకు వేల సంఖ్యలో విగ్రహాలు తయారు చేశాను. ఒక్క ఫీట్ నుంచి 12 ఫీట్ల ఎత్తు విగ్రహాలు తయారు చేశాను. విగ్రహాల తయారీకి ఏటా రాజస్థాన్ నుంచి వచ్చి వెళ్తా.
– సోహన్, రాజస్థాన్ కళాకారుడు

30 ఏళ్లుగా ఇదే వృత్తి

30 ఏళ్లుగా ఇదే వృత్తి

30 ఏళ్లుగా ఇదే వృత్తి