
13న జాతీయ లోక్ అదాలత్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య
మంచిర్యాలక్రైం: వచ్చే నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం న్యాయవాదుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 90రోజుల మధ్యవర్తిత్వం, మీడియేషన్ 2024 జూన్ ఒకటిన ప్రారంభించారని, అన్ని న్యాయస్థానాల్లో రాజీకి తగిన కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తారని తెలిపారు. ఇప్పటివరకు 41కేసులు మధ్యవర్తిత్వానికి పంపించినట్లు తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు చొరవ చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి రామ్‌మోహన్‌రెడ్డి, న్యాయవాదులు కొత్త సత్తయ్య, పులి రాజ మళ్లు ఎం.రవీందర్, గంగయ్య, శైలజ పాల్గొన్నారు.