
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
● బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
బెల్లంపల్లిరూరల్: ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సబ్ కలెక్టర్ ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్ అన్నారు. శుక్రవారం రాజాయోగిని దాదా ప్రకాష్ మణీజీ 18వ జయంతిని పురస్కరించుకుని బెల్లంపల్లి బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలకు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రక్తనిధి కేంద్రం ఇంచార్జీ మధుసూదన్‌రెడ్డి, కేంద్రం నిర్వాహకులు బీకే పద్మ, బీకే కై వల్య, వైద్యులు మధుకర్‌నాయక్, జుబేర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బాధ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.