
పాల సేకరణకు కృషి చేయాలి
లక్సెట్టిపేట: విజయ పాల డెయిరీ సిబ్బంది పాల సేకరణకు కృషి చేయాలని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని తెలంగాణ విజయ పాల డెయిరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రైతులు, పశువులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం డెయిరీలోని పరికరాలు, రికార్డులు, ప్యాకింగ్ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జీఎం(పీఅండ్‌ఐ) మధుసూదన్‌రావు, డీడీ నందకుమారి, మేనేజర్ డి.నవీన్, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.