
నేరస్తులపై గ్యాంగ్ ఫైల్స్
మంచిర్యాలక్రైం: పదే పదే నేరాలకు పాల్పడిన వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నా రు. శుక్రవారం కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్ కేసులు, తరచూ నమోదవుతున్న కేసులపై ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. సీపీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో సాంకేతికతను ఉపయోగించి నేర పరిశోధన పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. కేసులను త్వరగా చేధించి కోర్టులో సరైన ఆధారాలతో చార్జీషీట్ దాఖలు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణా, నకిలీ విత్తనాలు, దోపిడీ, గంజాయి నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
భద్రత చెక్ పంపిణీ
మంచిర్యాలక్రైం: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఏఎస్సై ఎం.వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులకు సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం రూ.8లక్షల భద్రత చెక్‌ను అందజేశారు. వెంకటరెడ్డి భార్య శ్రీలత, కుటుంబ సభ్యులు, ఎస్‌బీ ఏసీీపీ మల్లారెడ్డి, ఏవో శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.