
30న రక్షణ వారోత్సవాల బహుమతి ప్రదానం
శ్రీరాంపూర్: ఈ నెల 30న ప్రగతి మైదానంలో 55వ రక్షణ వారోత్సవాల బహుమతి ప్రదా నోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2024లో కంపెనీ వ్యాప్తంగా నిర్వహించిన రక్షణ వారోత్సవాల్లో ప్రతిభ కనబర్చిన గనులు, డిపార్టుమెంట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా డీజీఎంఎస్ ఉత్వల్ తా, సింగరేణి సీఎండీ బలరాం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ నెల 31న శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్‌లో సింగరేణి స్థాయి సేఫ్టీ ట్రైపార్టియేట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన ఏరియాలోని కార్మిక సంఘాల నేతలతో సేఫ్టీ బహుమతుల ప్రదానోత్సవంపై చర్చించారు. సమావేశాల్లో ఏరియా ఎస్‌వోటు జీఎం యన్.సత్యనారాయణ, డీవైపీఎం రాజేశ్వర్, సీనియర్ పీఓ కాంతారావు, యూనియన్ల నాయకులు బాజీసైదా(ఏఐటీయూసీ), జే.శంకర్‌రావు(ఐఎన్టీయూసీ), గుల్లా బాలాజీ(సీఐటీయూ), బండి రమేశ్(టీబీజీకేఎస్), నాతాడి శ్రీధర్‌రెడ్డి(బీఎంఎస్) పాల్గొన్నారు.