
ఉద్యోగులకు మెరుగైన వసతులు
నస్పూర్: సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో రూ.1.10లక్షలతో ఆధునీకరించిన ఐటీ విభాగాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు మారుతున్న కాలానికి అనుగుణంగా అనుకూల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను ఆధునీకరించామని, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రెటరీ బాజీసైదా, శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజీఎం భీభత్స, అధికారులు సాంబశివరావు, రాజన్న, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.