
రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించండి
జన్నారం: ఖానాపూర్ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. గురువారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్ నుంచి బెల్లాల్, ఖానాపూర్ నుంచి తర్లపాడు, ఉట్నూర్ నుంచి గుడిహత్నూర్, ఉట్నూర్ నుంచి హస్నాపూర్ నార్నూర్ చౌరస్తా, కలమడుగు నుంచి జన్నారం, జన్నారం నుంచి కవ్వాల్ రోడ్లను విస్తరించాలని కోరారు. మంత్రి స్పందించి రోడ్ల విస్తరణకు ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్‌రాజ్‌ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.