ఫుట్‌బాల్‌ పోటీల్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ పోటీల్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ

Aug 22 2025 3:16 AM | Updated on Aug 22 2025 12:12 PM

ఫుట్‌బాల్‌ పోటీల్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ

ఫుట్‌బాల్‌ పోటీల్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ

బెల్లంపల్లిరూరల్‌: సుబ్రతో ముఖర్జీ జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం(సీఓఈ) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. గురువారం విద్యాలయంలో డీఈవో యాదయ్య, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి యాకుబ్‌ ఆధ్వర్యంలో అండర్‌–15, 17 విభాగం ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించారు. సీఓఈ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. 

విజేత జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ ఆకిడి విజయసాగర్‌ తెలిపారు. అండర్‌–15 విభాగం పోటీల్లో మంచిర్యాల ట్రినిటి విద్యార్థులు, అండర్‌–17 విభాగంలో కోటపల్లి గురుకుల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్‌ అబ్జర్వర్లు పీడీలు రవి, చాంద్‌పాషా, నిర్వాహకులు అల్లూరి వామన్‌, రాజశేఖర్‌, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాలక్రైం: మంచిర్యాల–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి(30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్‌పీ ఎస్సై మహేందర్‌ తెలిపారు. సంఘటన స్థలం వద్ద మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఒంటిపై బ్లూ కలర్‌ నెక్‌ టీషర్ట్‌, టీ షర్ట్‌పై ఆర్‌ఎస్‌పీ అని, నా బలగం మా గళం అని తెలుగులో రాసి ఉన్నట్లు తెలిపారు. నలుపు రంగు ఫార్మల్‌ పాయింట్‌ ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపర్చామని, వివరాలకు జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు.

పోస్టర్లు తగులబెట్టిన వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని తిర్పెల్లిలో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లను తగులబెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. పట్టణానికి చెందిన అనుదీప్‌ బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో తిర్పెల్లిలో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన రాముడు, ప్రధాని నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పోస్టర్లను చించేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టారని పేర్కొన్నారు. తిర్పెల్లికి చెందిన అవారి సాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

తాటిచెట్టుపై నుంచి పడి కార్మికుడికి తీవ్ర గాయాలు

తాండూర్‌: మండలంలోని మాదారం–3 ఇంక్లైన్‌ గ్రామానికి చెందిన రంగు లక్ష్మీనారాయణ గౌడ్‌ తాటిచెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం గ్రామ సమీపంలోని తాటిచెట్టుపైకి ఎక్కి కల్లు తీస్తుండగా అదుపుతప్పి జారి కిందపడ్డాడు. కాలుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement