
ఆగని పోడుపోరు
దండేపల్లి: మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోగల లింగాపూర్ బీట్‌లోని 380 కంపార్ట్‌మెంట్‌లోని అటవీభూమిలో కొద్దిరో జులుగా కొందరు సమీప గ్రామాల ఆదివాసీ గిరిజనులు చెట్లపొదలు తొలగించారు. దీంతో అప్పటినుంచి అటవీ అధికారులు, గిరిజ నులకు మధ్య పోడు పోరు సాగుతోంది. అట వీ, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు పలు సార్లు గిరిజనులకు కౌన్సిలింగ్ ఇవ్వగా కొద్ది రోజులు ఆగినట్లే ఆగినవారు తొలకరి వర్షాల కు చెట్లపొదలు తొలగించిన భూముల్లో విత్తనాలు చల్లారు. అవి మొలకెత్తగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం అక్కడి కి వెళ్లి వాటిని తొలగించారు. విషయం తె లు సుకున్న ఆదివాసీ గిరిజనులు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. త హసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసిద్దీన్ సి బ్బందితో అక్కడికి చేరుకున్నారు. గిరిజనుల కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు విని పించుకోలేదు. విషయాన్ని సీఐ జన్నారం ఎ ఫ్‌డీవో రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లగా వెంట నే ఆయన అక్కడకు చేరుకున్నారు. ఎఫ్‌డీవో రావడంతోనే కొంతమంది గిరిజనులు ఆయ న కాళ్లపై పడి తాము సాగు చేసుకుంటున్న భూమి తమకివ్వాలని వేడుకోగా, వారు కుదరదని చెప్పారు. అటవీ భూములు వదిలి వెళ్లకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొద్దుపోయేదాకా అక్కడే ఉన్నవారంతా ఆ తర్వాత వెళ్లిపోయారు.