
స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. చిన్నతనం నుంచి ప్రశ్నించడం అలవాటుగా చేసుకుని తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు, నీరు, నిధులు నియామకాల్లో అసమానతలను తొలగించేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు పుస్తకాలు రచించారని, తన రచనలతో గ్రామగ్రామాన తెలంగాణ వాదాన్ని తీ సుకువెళ్లడంలో కృషి చేశారని తెలిపారు. అనంతరం నెన్నెల తహసీల్దార్ జ్యోతి మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
లక్సెట్టిపేట: అంగన్‌వాడీ కేంద్రంలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట పీహెచ్‌సీ, అంగన్‌వాడీ కేంద్రం, దౌడపల్లి, చందారం, మున్సిపాలిటీ పరిధి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని, పీహెచ్‌సీలో రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఎంపీడీవో సరోజ, ఏపీవో వేణుగోపాల్ పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సీఎస్‌ఆర్ నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురు గు కాల్వలు, రహదారులు, చెరువు పూడికలు, ఓపెన్ జిమ్, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేయాలన్నారు. సీపీవో పూర్ణచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్