
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాడికొండ రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని అనేకమార్లు విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని విమర్శించారు. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడు మణిచరణ్, నాయకులు రెహమాన్, సంజయ్, ఆకాష్, వెంకటచరణ్, దినేష్, కార్తీక్, మణిదీప్, అనిల్, సిద్ధార్థ పాల్గొన్నారు.