
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కండి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
బెల్లంపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన బెల్లంపల్లి మీదుగా ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్తుండగా కన్నాల నేషనల్ హైవే హన్మాన్ జంక్షన్ వద్ద పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. పార్టీ పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, మహిళలు ఆయన చేతికి రాఖీ కట్టారు. శివ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరగౌడ్, మాజీ ఎంపీ బి.వెంకటేష్‌నేత, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.