
గుండెపోటుతో తహసీల్దార్ మృతి
నెన్నెల: నెన్నెల మండల తహసీల్దార్ ముద్దమల్ల జ్యోతి(50) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయా రు. మంగళవారం సా యంత్రం 6గంటలకు విధులు ముగించుకుని మంచిర్యాల సమీపంలోని నస్పూర్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఒంటరిగా ఉంటున్న ఆమెకు రాత్రి 11గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో కారు డ్రైవర్‌కు ఫోన్ చేశారు. డ్రైవర్ వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు. ఆమె స్వగ్రామం జగిత్యాలలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో డీఏఓగా పని చేసిన ఆమె గత నెల 9న నెన్నెల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. కోటపల్లి, జైపూర్, నస్పూర్ మండలాల్లో తహసీల్దార్‌గా పని చేశారు. జ్యోతిమృతితో తహసీల్దార్ కార్యాలయంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. భీమిని ఏడీఏ సురేఖతోపాటు కార్యాలయ సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గుండెపోటుతో తహసీల్దార్ మృతి