
తెలంగాణను అగ్రస్థానాన నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దే
నస్పూర్: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చి తెలంగాణను దేశంలో అగ్రస్థానాన నిలబెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంగళవారం నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను నస్పూర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో డిజిటల్ స్క్రీన్‌పై వీక్షించారు. అనంతరం దివాకర్‌రావు మాట్లాడు తూ.. ప్రతీ ఎకరాకు సాగునీరందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించలేరని పేర్కొన్నారు.