
గూడెంలో పవిత్రోత్సవాలు
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనా రాయణస్వామి ఆలయంలో మూడురోజులు నిర్వహించనున్న పవిత్రోత్సవాలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అ ఖండ దీపస్థాపన, విశ్వక్సేనారాధన, వాసుదేవా పుణ్యాహావాచనం, రుత్విక్‌వరణం, అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, స్థా పిత దేవతా హవనములు, మంత్రపుష్పం, తీ ర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వై భవోపేతంగా నిర్వహించారు. ఆలయ పవిత్ర త, భక్తుల శ్రేయస్సు కోసం నిర్వహించే వేడుకల్లో ఆలయ ఈవో శ్రీనివాస్, యాజ్ఞికులు అ భిరామాచార్యులు, వేదపండితులు నారాయణశర్మ, భరత్‌శర్మ, ప్రధానార్చకుడు రఘుస్వామి, అర్చకులు సంపత్‌స్వామి, సురేశ్‌స్వామి, రామకృష్ణస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.