
ప్రాణాలతో బయటపడ్డా..
హెల్మెట్ ధరించినప్పు డు మెడకింద బెల్టు స క్రమంగా ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే ప్రమాదం జరిగినప్పు డు తలకు హెల్మెట్ ఉ న్నా ఎలాంటి ఉపయో గం ఉండదు. వేలల్లో కేసులు నమోదవుతున్నా వాహనదారుల్లో ఏమాత్రం మార్పురావడం లేదు. కొందరు నాసిరకం హెల్మెట్ వినియోగిస్తున్నారు. మరి కొందరు హెల్మెట్‌ను బండికి తగిలేసి వెళ్తున్నారు. పోలీసులు ఉన్నారని తెలియగానే బెల్టు పెట్టుకోకుండానే తలకు తగిలేస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఊడిపోవడంతో తలకు తీవ్రగాయాలై మృత్యువాత పడుతున్నారు. ఒకసారి నేను కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యా. హెల్మెట్ ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డా.
– కే.మనోజ్‌కుమార్, బైక్ రైడర్, మంచిర్యాల