
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కుంటాల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ఏముల రాములు(22) మూడు నెలల క్రితం గల్ఫ్ నుంచి తిరిగివచ్చాడు. బుధవారం పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఓలా వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుని తండ్రి రాములు, తమ్ముడు లక్ష్మణ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.