
నాణ్యత పాటించాలి
వాహనం కొనుగోలు చేసేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నాం. ధర ఎక్కువైనా ఐఎస్‌ఐ మార్కు ఉన్న నాణ్యమైన హెల్మెట్ వాడాలి. శిరస్త్రాణం ధరించడం వల్ల జుట్టు ఊడిపోతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అది అపోహ మాత్రమే. వేసవిలో ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు ఉంటోంది. పది నిమిషాలు ఎండలో తిరిగినా వడదెబ్బ తగిలే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుంది.
– జాడి సత్యనారాయణ, వేర మోటార్స్ హీరో బైక్ షోరూం జనరల్ మేనేజర్,
మంచిర్యాల