
ఉద్యోగులందరికీ ఇన్సెంటివ్
నస్పూర్: ఉద్యోగులందరికీ ఇన్సెంటివ్ లభిస్తుందని ఎస్‌ఆర్‌పీ ఏరియా డీజీఎం అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఎస్‌వో టు జీఎం ఎస్.సత్యనారాయణ ఆధ్వర్యంలో సింగరేణి గుర్తింపు సంఘం నాయకులతో ఏరియాలోని ఉద్యోగుల ఇన్సెంటివ్ విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రెటరీ బాజీసైదా, డీజీఎం ఐఈడీ రాజన్న, గుర్తింపు సంఘం నాయకులు కొట్టె కిషన్‌రావు, కొమురయ్య, బద్రి బుచ్చయ్య, నల్లపు సత్తయ్య, శంకర్, సధానందం, శ్రీనివాస్, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఆర్‌ఎంఎస్ మెడికల్ కార్డు
రెన్యూవల్ చేసుకోవాలి
సింగరేణి రిటైర్డు ఉద్యోగులు, వారి భార్యలు సీపీఆర్‌ఎంఎస్–ఎన్‌ఈ మెడికల్ కార్డు రెన్యూవల్ చేసుకోవాలని ఎస్‌ఆర్‌పీ ఏరియా డీజీఎం అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెన్యూవల్ కోసం ప్రతీ సంవత్సరం నవంబర్‌లో లైవ్ సర్టిఫికేట్ సమర్పిస్తారని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో దాదాపు 621మంద మాజీ ఉద్యోగులు, వారి భార్యలు గత నవంబర్ నుంచి ఇప్పటివరకు మెడికల్ కార్డు రెన్యూవల్ కోసం లైవ్ సర్టిఫికేట్ సమర్పించలేదని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా లైవ్ సర్టిఫికేట్ సమర్పించి రెన్యూవల్ చేసుకోవాలని, వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.