
‘విద్యార్థినులు అస్వస్థతకు గురైతే పట్టించుకోరా?’
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా, కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, చికిత్స అందించకపోవడం పట్ల ఆశ్రమ పాఠశాల సిబ్బందిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ పాలనలో ఆగమైపోతోందని తెలిపారు. కేసీఆర్ హయాంలో గిరిజన గురుకుల పాఠశాలలు అంటే ఒక బ్రాండ్ అని, అందులో సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో సిఫారసులు చేయించినా సీట్లు దొరకని పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో తలకిందులైందని విమర్శించారు.