
‘బనకచర్ల ప్రాజెక్ట్ అడ్డుకుంటాం’
చెన్నూర్: బనకచర్ల ద్రోహాన్ని బయటపెట్టి, ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకుంటామని బీఆర్‌ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే కళాశాల విద్యార్థులకు సోమవారం బనకచర్ల ప్రాజెక్ట్ దోపిడీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షుడు నాయబ్, నాయకులు ఆసంపల్లి సంపత్, ప్రశాంత్‌రెడ్డి తిరుపతి, మనోహార్, అజయ్, రాజు, రాజేశ్, బన్నీ, రమేశ్, తిరుపతిలు పాల్గొన్నారు.