
ముధోల్‌లో పట్టపగలే చోరీ
తానూరు(ముధోల్): ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్‌నగర్ కాలనీలో సోమవారం పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు సాయినాథ్ ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు అపహరించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సై బిట్ల పెర్సిస్ ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.