
జీవో 49 రద్దు హర్షణీయం
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఉట్నూర్‌రూరల్/ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జీ వో 49ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హ ర్షణీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అ న్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో రద్దు చేసినందుకు ఆదివాసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆయన ఎ మ్మెల్సీ దండే విఠల్, కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జీవో 49 రద్దుకు వినతిపత్రం అందజేశారు. జీవో విడుదల అనంతరం జిల్లాలో పరిస్థితులపై కూలంకషంగా వివరించారు. కాగా, జీవో రద్దు ఉత్తర్వుల అనంతరం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆదివాసీల కోసం పని చేస్తోందని తెలిపారు. మాజీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.