
చాతాలో వృద్ధుడి దారుణ హత్య
● గొంతుకోసి హతమార్చిన దుండగులు ● డాగ్‌స్క్వాడ్‌తో గాలిస్తున్న పోలీసులు
కుభీర్: మండలంలోని చాతా గ్రామంలో గురువారం రాత్రి తాళ్లపల్లి బలరాంగౌడ్ (70)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్యచేశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర కారం. బలరాంగౌడ్ కొడుకు, కోడలు గురువారం మధ్యాహ్నం తన చిన్నకూతురు ఇంటికి వేములవా డకు వెళ్లారు. బలరాంగౌడ్ దినమంతా తెల్లకల్లు దు కాణం నడిపాడు. రాత్రి 10వరకు గురుబోధ భజన పాటలు పాడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వా త గ్రామ చివరలోని తనింట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్యచేసి వెళ్లారు. ఉద యం కొందరు తెల్లకల్లు కోసం బలరాంగౌడ్ ఇంటికి చేరుకున్నారు. అతడిని పిలువగా బయటికి రాకపోవడంతో తలుపు తీసి లోనికి వెళ్లి చూడగా రక్తం మడుగులో అతడి మృతదేహం కనిపించింది. వారు వెంటనే మృతుడి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏఎస్పీ అవినాష్, సీఐ నైలు, ఎస్సై కృష్ణారెడ్డి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. భక్తిభావం కలిగి అందరితో కలివిడిగా ఉండే గంగారాంగౌడ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లున్నారు. మృతుడి కొడుకు రమేశ్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.