
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన రెండోవిడత కౌన్సెలింగ్
బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో రెండోవిడత కౌన్సెలింగ్ ముగిసింది. 218 సీట్ల గాను 178 మంది హాజరయ్యారు. పీహెచ్‌సీ, క్యాప్ కోటా విద్యార్థుల కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గ్లోబల్ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ పర్యవేక్షించారు. కన్వీనర్, కో కన్వీనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో యువ వేదిక
వీ హబ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సేల్ ఆర్జీయూకేటీ సమన్వయంతో బాసర ట్రిపుల్‌ఐటీలో శుక్రవా రం యువవేదిక నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ గో వర్ధన్ మాట్లాడుతూ.. యువవేదిక గ్రామీణ విద్యార్థులకు జాతీయస్థాయికి నడిపించే ఆవిష్కరణ వేదిక అని పేర్కొన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ ‘ఇది మెంటార్‌షిప్, స్టార్టప్ మద్దతుకు ఉత్తమ ప్రారంభం’ అని తెలిపారు. వీ హబ్ ప్రతినిధులు జాహిద్ అక్తర్‌షేక్, ఉహా సజ్జా, తజ్దార్ అలీ తజ్, రేఖా మేఘన, సౌమ్యశ్రీ విద్యార్థులకు ప్రేరణ కలిగించే సెషన్లు, డిజైన్ థింకింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రాకేశ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 300కిపైగా విద్యార్థులు ఆవిష్కరణ, నాయకత్వం, వ్యవస్థాపకతలో ప్రాథమిక అవగాహన పొందారు.