
కేకే–ఓసీలో విలువైన కేబుల్ చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి ఏరి యాలోని కేకే–ఓసీ లో సుమారు రూ.60వేల విలు వైన 80 నుంచి 90 మీటర్ల ఫ్లెక్సెబుల్ వైర్ దొంగలు ఎత్తుకెళ్లారు. ఓసీలో పంపు వద్ద వినియోగించడానికి సిద్ధంగా ఉంచిన కేబుల్‌ను కట్ చేసి అక్కడే పైకవర్ తొలిచి తీసుకెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ నిర్లక్ష్యంతోనే చోరీ జరినట్లు తెలుస్తోంది. దొంగలు కేబుల్‌ను తొలిచి ఎత్తుకెళ్లే వరకూ సెక్యూరిటీకి కనిపించకపోవడం విడ్డూరం. ఈ విషయమై ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ నగునూరి రవిని సంప్రదించగా, కేబుల్ చోరీకి గురైంది నిజమేనని తెలిపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసినట్లు పేర్కొన్నారు.
మందమర్రిలో భారీ చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధి బురుదగూడెంలోని సింగరేణి ఉద్యోగి దుర్గం రాజ్‌కుమార్ ఇంట్లో భారీ చోరీ జరి గింది. సీఐ శశిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమా ర్ తన భార్య, తలిదండ్రులతో బుధవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికెళ్లారు. శుక్రవారం ఉదయం బురుదగూడెంలోని ఇంటికి వ చ్చి చూడగా ముందు గేటు, ఇంట్లోని బీరువా తెరిచి ఉంది. బీరువాలో దాచి ఉంచిన ఆరు తు లాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించారు. వెంటనే పోలీ సులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఫింగర్ ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వా డ్, క్లూస్ టీంను రప్పించి సేకరించిన ఆధారాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల ఆచూకీ తెలుసుకునే ప్రక్రియ వేగవంతం చేసినట్లు సీఐ తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు.

కేకే–ఓసీలో విలువైన కేబుల్ చోరీ