
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసారూరల్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ కష్టపడకుండా డబ్బు సంపాదించాల న్న ఆలోచనతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం భైంసారూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సైలు శంకర్, సుప్రియ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. ఈనెల 15న హజ్గుల్ ఎక్స్ రోడ్డుకు కొద్ది దూ రంలో ఇద్దరు వ్యక్తులు కారులో సెల్‌ఫోన్లు చూస్తు కూర్చున్నారు. భైంసాలో నివాసముంటున్న మహా రాష్ట్ర వాసి దతురి వినోద్, ఆదిలాబాద్‌కు చెందిన సిందే దినేశ్ వీరి వద్దకు వెళ్లారు. వీరిద్దరు ఎలాంటి సంపాదనలేకుండా జులాయిగా తిరుగుతున్నారు. కారులో ఉన్న ఇద్దరిని చంపేస్తామని భయపెట్టి బీ రు బాటిల్‌తో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద ఉన్న రూ.10వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకువెళ్లారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లి తక్కువ ధరకు గంజాయి కొని ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే అధిక డబ్బులు వస్తాయని నిర్ధారించుకున్నారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి గురువారం పార్డి(బీ) బైపాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. వీరి వద్ద 1,070 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నైలు, ఎస్సైలు శంకర్, సుప్రియ, సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. ఏఎస్సై మారుతి, పోలీసులు ఉన్నారు.