
జిమ్‌లో డ్రగ్స్, స్టైరెడ్
ఆదిలాబాద్‌టౌన్: చట్టవిరుద్ధంగా డ్రగ్స్, స్టైరెడ్ విని యోగిస్తున్న ఆదిలాబాద్‌లోని ఓ జిమ్‌పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఆ జిమ్‌కు వచ్చేవారికి స్టె రైడ్, డ్రగ్స్ అందజేస్తున్నట్లు తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఆర్డీ వో ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల అ ధికారులతో కలిసి పట్టణంలోని వినాయక్ చౌక్‌లో గల లయన్ జిమ్ వద్దకు శుక్రవారం చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి 20 ఎంఎల్ ఏఎంపీ ఇంజక్షన్ బాటి ల్, 3 ఖాళీ ఇంజక్షన్లు, 36 స్టైరెడ్ ట్యాబ్లెట్లు, అలాగే సర్జరీకి వాడే మరో మూడు డ్రగ్స్ ఇంజక్షన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. అలాగే జిమ్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిమ్ నిర్వాహకుడు షేక్ ఆదిల్ చట్టవ్యతిరేక డ్రగ్స్ తీసుకుంటున్న ట్లు పేర్కొన్నారు. అలాగే జిమ్‌కు వచ్చేవారికి కూడా ఇస్తూ అనారోగ్యం బారిన పడేలా వ్యవహరించిన అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిమ్‌కు వస్తున్న వారికి అందజేత
దాడి చేసి స్వాధీనపరుచుకున్న పోలీసులు