
ప్రజలను ఇబ్బందిపెడితే.. నన్ను పెట్టినట్లే!
● అటవీ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆగ్రహం
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. ‘‘ప్రజలను ఇబ్బంది పెడితే, నన్ను ఇబ్బంది పె ట్టినట్లే,’’ అని హెచ్చరించారు. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు విన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు.
రైతుల ఆందోళన..
అంతకుముందు, ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయం వద్ద బెల్లంపల్లి, నెన్నెల మండలాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారులు తమ పత్తి పంటలను ధ్వంసం చేసి, వ్యవసాయం చేయకుండా వేధిస్తున్నారని తెలిపా రు. కొందరు రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటనలకు అటవీ అధి కారులే కారణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశా రు. వనమహోత్సవానికి హాజరైన బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్, డెప్యూటీ రేంజ్ అధికా రి గౌరి శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సక్రమంగా విధులు నిర్వహిస్తే స్వాగతం, లేకపోతే న మస్కారం చేసి పంపిస్తా,’’ అని హెచ్చరించారు. ప్ర జల ఇబ్బందులను డీఎఫ్‌ఓ, మంత్రికి తెలియజేస్తానని, ప్రజలను వేధించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమేనని అన్నారు.
సహకరించకుంటే చర్యలు..
తన నియోజకవర్గంలో పోడు రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని అటవీ అధికారులకు స్పష్టం చేశారు. ‘‘చెన్నూర్‌లో నా సోదరుడు (ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్)కి ఒక రూల్, నాకు మరొక రూల్ ఎలా సమంజసం?’’ అని ప్రశ్నించారు. అటవీ అధికారులు సహకరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ప్రజా సమస్యలను ప్రధానమంత్రికి కూడా చెప్పే దమ్ము నాకుంది,’’ అని స్పష్టం చేశారు.
పోడు భూముల సమస్యల పరిష్కారానికి హామీ
పోడు భూముల సమస్యలను తన దృష్టికి తీసుకొ స్తే, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అటవీ అధికారులు నేరుగా రైతుల పంటలను ధ్వంసం చేయడం మానుకోవాలని ఆదేశించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.