
సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి
పాతమంచిర్యాల: బీసీ కార్పొరేషన్ ద్వారా యువతకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ఆయన మాట్లాడుతూ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలు గడిచినా ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు గజెళ్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, భిక్షపతి, చంద్రమౌళి, రాజేశం, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.