
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఎస్సై ఇ.సాయన్న, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలో దనోరా(బి) పంచాయతీ పరిధి ఇన్కార్‌గూడకు చెందిన ఎల్నారే అనిల్, ఉమ దంపతులకు ఏకై క కుమారుడు శుభం(23). డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 7న మద్యం తాగి ఇంటికొచ్చిన కుమారుడిని రోజు మద్యం ఎందుకు తాగుతున్నానవని తల్లి ఉమ మందలించింది. క్షణికావేశంతో వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి చెప్పాడు. గ్రామస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరు..
సోన్: అప్పుల బాధ, భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన పట్టం పోశెట్టి(34) గతంలో దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. భార్య పోసవ్వ అలియాస్ అరుణకు కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అటు అప్పుల బాధ, ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన పోశెట్టి గురువారం ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి అక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు.

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య