
నీట్‌లో విద్యార్థి ప్రతిభ
లక్సెట్టిపేట: నీట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన కందుల కుషీంద్రవర్మ ప్రతిభ కనబర్చి రాష్టస్థాయి 59 ర్యాంకు సాధించాడు. పదో తరగతి వరకు పట్టణంలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి మంచి మార్కులు సాధించాడు. ఈయన తండ్రి ప్రవీణ్‌కుమార్ ప్రైవేటు టీచర్, తల్లి సుమలత గృహిణి. కుమారుడు నీట్‌లో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు.
గుడుంబా పట్టివేత
జైపూర్: బైక్‌పై గుడుంబా తరలిస్తుండగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భీమారం మండల కేంద్రంలో ఆరెపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తూర్ మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ శంకర్ బైక్‌పై 30లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించగా జోడువాగు వద్ద శంకర్‌ను అదుపులో తీసుకుని బైక్, గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బాసరలో ముగిసిన గురుపౌర్ణమి వేడుకలు
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు గురువారంతో ముగిశాయి. వ్యాసమహర్షి, సరస్వతి, వ హాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఉన్నారు.

నీట్‌లో విద్యార్థి ప్రతిభ