
గవర్నర్‌ను కలిసిన మాజీ ఎంపీ ‘సోయం’
కైలాస్‌నగర్/ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ సోయం బాపూరావు మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 49 ఆదివాసీ హక్కులను కాలరాసేలా ఉందని, వెంటనే రద్దుచేసి ఆ ప్రాంతంలో నివసించే గిరిజన, గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని కో రారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లను ఏకపక్ష ంగా టైగర్ కన్జర్వేషన్‌లో కలపడంతో అడవులు, అటవీ భూములను నమ్ముకుని బతికే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం పోడు భూముల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో జీవో జారీ చేయడం సరికాదన్నారు. ఈ జీవో కారణంగా 339 ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిల భారతీయ గోండ్వానా మహాసభ ఉపాధ్యక్షుడు సిడాం అర్జు, జిల్లా మేడి కుర్సంగే మోతిరాం, రాజ్‌గోండ్ రాష్ట్ర కార్యదర్శి పెందూర్ సుధాకర్, రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.