
సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్‌సింగ్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, ఇందరిమ్మ ఇళ్లు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు.