ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Jul 15 2025 12:01 PM | Updated on Jul 15 2025 12:01 PM

ఉరేసు

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

తిర్యాణి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన అక్కిపల్లి మల్లేశ్‌ (45) మానసిక స్థితి బాగోలేక మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం శంకర్‌ అనే వ్యక్తికి చెందిన చేనులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఒంటరితనం భరించలేక యువకుడు..

లోకేశ్వరం: ఒంటరితనం భరించలేక గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన మాడబోయి శ్రీనివాస్‌(27) తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో సోదరి కవితతో కలిసి పెద్దమ్మ పోసాని వద్ద ఉంటున్నారు. మూడేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లిన శ్రీనివాస్‌ నాలుగు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని రూ.2.50 లక్షలు ఖర్చుచేసి ఇంటికి మరమ్మతులు చేయించాడు. సంబంధాలు కుదరకపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఆదివారం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా సోమవారం పంచగుడి వంతెన వద్ద శవమై కనిపించాడు. మృతుని పెద్దమ్మ పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మద్యానికి బానిసై ఒకరు..

భైంసారూరల్‌: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన తో కల గంగాధర్‌ (29) కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానియ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహా న్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎ స్సై తెలిపారు. మృతుని భార్య, కుమార్తె ఉన్నారు.

ఉద్యోగం రాలేదని ఒకరు..

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని న్యూకాలనీకి చెందిన పెరుగ నిఖిల్‌ సాత్విక్‌ (30) బీటెక్‌ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

సోన్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని సంఘంపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఆర్‌ఐ అల్‌మున్‌ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గొర్రె శ్రీకాంత్‌ పెంకుటింట్లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్పందించిన స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంట్లోని బీరువా, బట్టలు, రూ.లక్ష నగదు, బంగారం, సామగ్రి దగ్ధమైనట్లు తెలిపారు. సుమారు రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు శ్రీకాంత్‌ కోరుతున్నాడు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
1
1/1

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement