
స్తంభం పైనుంచి జారి పడి ఒకరు మృతి
బేల: మండలంలోని సిర్సన్న గ్రామంలో సోమవారం సాయంత్రం విద్యుత్ స్తంభంపై వీధి దీపాలు పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి గోదురి లస్మన్న (42) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రైవేటు లైన్‌మెన్ గోదురు లస్మన్న గ్రామంలోని ఓ కూడలిలో విద్యుత్ స్తంభంపై ఎక్కి వీధి దీపాలు పెడుతుండగా ప్రమాదవశాత్తు జారి సీసీ రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై మధుకృష్ణ, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.