
సమయానికి రారు.. పట్టించుకోరు!
హాజీపూర్ పీహెచ్‌సీ సిబ్బంది సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఉదయం సమయానికే తాళాలు తీసినా.. సిబ్బంది మాత్రం సమయం దాటాకే వస్తున్నారని, సాయంత్రం కూడా సమయం కాకముందే తాళం వేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్)

సమయానికి రారు.. పట్టించుకోరు!