మామడ: మండలంలోని ఎకో టూరిజం సందర్శన కేంద్రం అయిన తుర్కం చెరువును ట్రైనీ అటవీ అధికారులు శిక్షణలో భాగంగా మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 42 మంది ట్రైనీ బీట్ అధికారులు తుర్కం చెరువుతోపాటు యెంగన్న చెరువు వద్ద వలస పక్షులను ప్రత్యేక కెమెరాలతో వీక్షించారు. చెరువులకు వస్తున్న పక్షుల రకాల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడవిలో పెరుగుతున్న మొక్కల రకాలను తెలుసుకున్నారు. వారివెంట ఎఫ్‌ఆర్వోలు శ్రీనివాస్‌రావు, స్వరూప, ఎఫ్‌ఎస్‌వో శ్రీనివాస్, పీడీ కొండల్‌రావు ఉన్నారు.