
ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి నగదు అపహరణ
రెబ్బెన: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి నగదు అపహరించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు చింతలమానెపల్లి చెందిన మహిళ మంగళవారం రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వరకు వచ్చింది. అక్కడి నుండి మంచిర్యాల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే కండక్టర్‌కు చూపించేందుకు తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న ఆధార్‌కార్డును తీసేందుకు బ్యాగు తెరవగా అందులో ఉన్న రూ.15వేలు కనిపించలేదు. దీంతో బస్సును దేవులగూడ వద్ద ఆపి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది బస్సులో ఉన్న ప్రయాణికులందరి బ్యాగులను తనిఖీ చేసినా డబ్బులు లభించలేదు. అయితే రెబ్బెన బస్‌స్టాప్‌లో కొంతమంది ప్రయాణికులు బస్సు దిగిపోయారని, వారిలోనే డబ్బులను చోరీ చేసిన ఉండి ఉంటారని పోలీసులు భావించారు. ఘటనతో మంచిర్యాలకు వెళ్లే ప్రయాణికులు సుమారు 1:15 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఘటనపై బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.