
క్వారీలోకి నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జైపూర్: వర్షాకాలంలో క్వారీలోకి వర్షపునీరు రా కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, సేఫ్టీ బెల్లంపల్లి రీజియన్ జీఎం రఘుకుమార్ తెలిపారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీని మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా క్వారీలో బొగ్గు నిల్వలు పరిశీలించారు. ఈ ఏడాది నిర్ధేశిత ఓబీ, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు చేపట్టాల్సిన ప్రణాళికలపై దిశానిర్ధేశం చేశారు. ప్రతీ ఉద్యోగి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇందారం ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, గని ఆపరేషన్స్ మేనేజర్ శంకర్, ప్రాజెక్టు ఇంజనీర్ రామకృష్ణారావు, రక్షణాధికారి సతీశ్, సర్వే అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.