
భాష గొప్పతనాన్ని చాటాలి
మంచిర్యాలఅర్బన్: తెలుగు భాష గొప్పదనా న్ని చాటి చెప్పాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులదని ఎస్‌సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకు డు ఓంప్రకాశ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చెన్నూర్ రోడ్డు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ‘పద్యవైభవం’ సెషన్‌పై మాట్లాడారు. తె లుగు భాష గొప్పతనం, భాష ప్రత్యేకత గు రించి ఉపాధ్యాయులకు వివరించారు. తెలు గు భాష ఉపయోగాన్ని మరింతగా పెంచాల ని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలి టీ కో ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, శిక్షణ కేంద్రం సెంటర్ ఇన్‌చార్జి వెంకటస్వామి, డీఆర్పీలు కొండు జనార్దన్, నీలాదేవి, సత్యంయాదవ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.