
ఉమెన్స్ హ్యాండ్‌బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం ఫైనల్‌మ్యాచ్‌లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్‌లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్‌లోని బూజ్‌లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్‌కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్‌రెడ్డి, గ్రౌండ్ ఇన్‌చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు.
● రన్నరప్‌గా రంగారెడ్డి జట్టు