
మూడు స్థానాలు ముందుకు..!
● మెరుగైన ‘పది’ ఫలితాలు ● 96.54శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రస్థాయిలో 17వ స్థానం
ప్రభుత్వ పాఠశాలల్లో
వందశాతం ఉత్తీర్ణత
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో 167 ప్రభుత్వ పాఠశాలల్లో 78 పాఠశాలలు ఉత్తమ ఫలితాలతో వంద శాతం సాధించాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ముందు వరుసలో నిలిచాయి. ఇందులో 101 లోకల్‌బాడీ పాఠశాలల్లో 46 స్కూళ్లు వందశాతం దూసుకెళ్లాయి. రెండో స్థానంలో 45 ప్రైవేట్(నూరుశాతం) పాఠశాలలు సరిపెట్టుకున్నాయి. 10 కేజీబీవీలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించా యి. జీఏహెచ్‌ఎస్–6 టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ –6, టీఎస్‌ఎంఎస్–3, ఎంజేపీ–5, ఎయిడెడ్–1, టీఎంఆర్‌ఎస్–1 వందశాతం ఫలితాలు సాధించాయి. టీఎస్‌ఆర్‌ఎస్, 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకటి కూడా నూరుశాతం ఫలితాలు సాధించలేకపోయాయి.
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా గతంతో పోల్చితే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది. జిల్లా 2023–24లో రాష్ట్రస్థాయిలో 20వ స్థానంలో నిలువగా.. ఈసారి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానంలో నిలిచింది. బుధవారం ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసింది. గత ఏడాది 92.42శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 96.54కు ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొత్తం 9,179మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,861మంది ఉత్తీర్ణత సాధించారు. 318మంది అనుత్తీర్ణులయ్యారు. బాలురు 4,743మంది పరీక్షకు హాజరు కాగా 4,560మంది పాసయ్యారు. బాలికలు 4,436మంది పరీక్షకు హాజరు కాగా 4,301మంది ఉత్తీర్ణత పొందారు. బాలుర ఉత్తీర్ణత శాతం 96.14 కాగా, బాలికలు 96.96ఉత్తీర్ణత శాతంతో పై చేయి సాధించారు. ఫెయిలైన వారిలో బాలురు 183మంది, బాలికలు 135మంది ఉన్నారు. ఫలితాల్లో 2022–23లో 23 స్థానం, 2023–24లో 20వ స్థానం సాధించగా రెండేళ్లుగా వరుసగా మరో మూడడుగులు(ఈ ఏడాది) సాధించి స్థానాన్ని ‘పది’ల పర్చుకుంది.
మోడల్‌స్కూల్ విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాల మోడల్‌స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 98 మందికి 95మంది ఉత్తీర్ణత సాధించారు. దినసరి కూలీ కుటుంబానికి చెందిన నల్లచరణ్ 600 మార్కులకు గాను 571 మార్కులు, వ్యవసాయ కుటుంబానికి చెందిన దుర్గం నక్షత్ర 566, కోడూరి ఆదిత్య 563 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కుటుంబసభ్యుల సమక్షంలో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లాలోని ఐదు మోడల్‌స్కూళ్లలో 571 మార్కులతో చరణ్ మొదటి స్థానం సాధించాడని ప్రిన్సిపాల్ బుచ్చన్న తెలిపారు.
పాఠశాలల వారీగా...
యాజమాన్యం స్కూల్ హాజరైన ఉత్తీర్ణత
సంఖ్య విద్యార్థులు
లోకల్‌బాడీ 101 2801 2649
ఎయిడెడ్ 02 193 190
జీఏహెచ్‌ఎస్ 14 382 363
జీహెచ్‌ఎస్ 07 208 175
కేజీబీవీ 18 642 622
ఎంజేపీ 07 439 436
టీఎంఆర్‌ఎస్ 03 134 125
టీఎస్‌ఎంఎస్ 05 443 432
టీఎస్‌ఆర్‌ఎస్ 01 68 66
టీఎస్‌డబ్ల్యూ
ఆర్‌ఎస్ 09 672 668
ప్రైవేట్ 80 3196 3136
మొత్తం 247 9179 8861
నాలుగేళ్లుగా ఫలితాలు
సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత
2021–22 10522 9528
2022–23 10071 8552
2023–24 9283 8579
2024–25 9179 8861
సంవత్సరం ఉత్తీర్ణత శాతం..
బాలురు బాలికలు శాతం
2021–22 88.44 99.82 90.55
2022–23 82.91 87.00 84.87
2023–24 91.36 93.52 92.42
2024–25 96.14 96.96 96.54
జిల్లా టాపర్‌గా సాయి శ్రీవల్లి
పదో తరగతి ఫలితాల్లో స్థానిక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని సాయి శ్రీవల్లి 588 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు మధుబాబు, ఉమ ప్రభుత్వ ఉపాధ్యాయులు. సాయి శ్రీవల్లి జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపిక కాగా ఈ ఏడాది జూన్ 13న బయలుదేరి జపాన్‌లో 15 నుంచి 21 వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననుంది. జాతీయ ఇన్‌స్పైర్ అవార్డు పొందడంతోపాటు రాష్ట్రపతి నుంచి ప్రశంసలు అందుకుంది. అస్ట్రోనాట్‌గా అంతరిక్షంలో అడుగుపెట్టి పరిశోధనలు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాయి శ్రీవల్లి తెలిపింది.
ఇంజినీర్ అవుతా..
మా నాన్న కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకు పదో తరగతి మొదటి మెట్టుగా భావించి ఇష్టపడి చదివాను. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 571 మార్కులు సాధించాను. ఐఐటీలో చేరాలని ఉంది. – నల్ల చరణ్,
మంచిర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి

మూడు స్థానాలు ముందుకు..!